|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 02:29 PM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లోనే రూ.25 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని, తద్వారా 26 లక్షల ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రానున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనా దక్షత, మంత్రి నారా లోకేశ్ అవిశ్రాంత కృషితో రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వస్తున్నాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు. బుధవారం నాడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ, “కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో దేశ, విదేశీ దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి ముందుకొస్తున్నాయి. చంద్రబాబు ఆర్థిక శాస్త్రంలో నిష్ణాతులు కాగా, ఆయన అనుభవం రాష్ట్రానికి శ్రీరామరక్షగా మారింది. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సైతం పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాదిన్నర కాలంలోనే రూ.25 లక్షల కోట్లకు పైగా విలువైన ఒప్పందాలు జరిగాయి. అనేక పరిశ్రమల పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ పెట్టుబడుల ద్వారా సుమారు 26 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది” అని వివరించారు.
Latest News