|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 07:08 PM
అమరావతిలో ఏర్పాటు కానున్న క్వాంటం వ్యాలీ ఆధునిక పరిశోధనలకు కేంద్రంగా మారాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. విద్య, వైద్యం, ఔషధాల రూపకల్పన సహా పలు రంగాల్లో ఈ కేంద్రం పనిచేయాలన్నారు. గురువారం పరిశోధకులు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తల బృందంతో సీఎం సమావేశమయ్యారు. వైద్యరంగంలో నూతన ఔషధాల రూపకల్పనతో పాటు మెటీరియల్ సైన్స్ పై పరిశోధనలకు గ్లోబల్ క్వాంటం బయో ఫౌండ్రీని ఏర్పాటుకు పరిశోధకుల బృందం సిద్ధంగా ఉందని తెలిపింది. దేశంలోనే తొలి క్వాంటం బయోమెడికల్ రీసెర్చ్ ఎకో సిస్టంగా ఇది రూపుదిద్దుకుంటుందని వివరించింది.
Latest News