|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 07:05 PM
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇగ్లాస్ ప్రాంతంలోని కరాస్ గ్రామంలోని ఓ ఇంట్లో 6 నెలల హసన్ అనే శిశువు ఆడుకుంటూ పొగాకు టూత్‌పేస్ట్ నోట్లో పెట్టుకుని మింగేశాడు. కొద్దిసేపటికే వాంతులు, అస్వస్థత కలగడంతో తల్లి అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే అప్పటికే బిడ్డ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పొగాకు టూత్‌పేస్ట్ పిల్లలకు పూర్తిగా విషమని, ఇది గుండె, ఊపిరితిత్తులు, పేగులు, మెదడుకు తీవ్రమైన హానిని కలిగిస్తుందని చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ సూర్యప్రకాశ్ హెచ్చరించారు.
Latest News