|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 10:19 AM
AP: ప్రేమ, పెళ్లి పేరుతో ముగ్గురు వ్యక్తులు ఒక యువతిని మోసం చేసి అత్యాచారం చేసిన ఘటన అనంతపురం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. డిప్లొమో రెండో సంవత్సరం చదువుతున్న యువతిని ఆటో డ్రైవర్ గురుమోహన్, బస్సులో పరిచయమైన ప్రదీప్, కళాశాలలో పరిచయమైన బ్రహ్మనాయుడు వేర్వేరుగా అత్యాచారం చేశారు. ఈ నెల 2 నుంచి 7వ తేదీ వరకు ఈ ఘటనలు జరిగాయి. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముగ్గురిపై పోక్సో కేసు నమోదు చేశారు.
Latest News