|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 11:24 AM
బిహార్‌లో భారీగా ఎయిడ్స్ కేసుల నమోదు ఆందోళ కలిగిస్తోంది. ఒక్క సీతామఢీ జిల్లాలో ఇప్పటివరకు 7,400 హెచ్‌ఐవీ కేసులు నమోదయ్యాయి. వీరిలో 400కి పైగా చిన్నారులు ఉండటం మరింత కలవరపాటుకు గురి చేస్తోంది. తల్లిదండ్రుల్లో హెచ్‌ఐవీ ఉన్న కారణంగా ప్రసవ సమయంలోనే ఈ పిల్లలకు వైరస్ సంక్రమించినట్లు వైద్యులు వెల్లడించారు. జిల్లాలోని ఏఆర్‌టీ కేంద్రంలో నెలకు 40–60 కొత్త కేసులు వస్తున్నాయని అధికారులు తెలిపారు. అవగాహన లోపం, సామాజిక కారణాలు ఈ పెరుగుదలకు కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Latest News