|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 11:27 AM
అల్లూరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పలువురు మృతి చెందడం, అనేకమంది గాయపడటం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు.
Latest News