|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 12:29 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీలో పలు పలు నియామకాలు చేపట్టారు. ఈ మేరకు వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. స్టేట్ ఎక్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గానికి చెందిన అవులవిష్ణువర్ధన్‌రెడ్డితో పాటు 15 మందిని రాష్ట్రకార్యదర్శులు(పార్లమెంట్)గా నియమించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా.. షేక్ గౌస్ మొహిద్దిన్ (విజయవాడ వెస్ట్), మీర్ హుస్సేన్ (విజయవాడ ఈస్ట్), కర్నాటి రాంబాబు (విజయవాడ వెస్ట్), మీర్జా సమీర్ అలీ బేగ్ (మార్కాపురం), ఆర్. శ్రీనివాసులురెడ్డి (పలమనేరు), కె.కృష్ణమూర్తిరెడ్డి (పలమనేరు), పోలు సుబ్బారెడ్డి (రాయచోటి), ఉపేంద్ర రెడ్డి (రాయచోటి), డి. ఉదయ్ కుమార్ (మదనపల్లె), వి.చలపతి (కోవూరు), గువ్వల శ్రీకాంత్ రెడ్డి (సింగనమల), డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి (తాడిపత్రి), సుభాష్ చంద్రబోస్ (కర్నూలు), రఘునాథరెడ్డి (జమ్మలమడుగు), ఎస్. ప్రసాద్ రెడ్డి (కమలాపురం), పార్టీ ఎస్‌ఈసీ సభ్యునిగా ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి (రాయచోటి) నియమితులయ్యారు.
Latest News