|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 01:42 PM
పూసపాటిరేగ మండలం చోడమ్మ అగ్రహారం వద్ద బుధవారం రాత్రి నిలిపిన ప్రైవేట్ బస్సులో చోరీ జరిగింది. శ్రీకాకుళం నుంచి విజయవాడకు ప్రయాణిస్తున్న జామి చంద్రశేఖర్, వినోద్‌ల బ్యాగుల్లో ఉన్న రూ.69 లక్షలను దుండగులు అపహరించారు. భోజన విరామం కోసం బస్సు ఆగిన సమయంలో బయటకు వెళ్లగా చోరీ జరిగినట్లు వారు తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు
Latest News