|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 01:43 PM
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్డుపై శుక్రవారం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. భద్రాచలం నుంచి అన్నవరం వెళుతున్న యాత్రికులతో కూడిన ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి.ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలియగానే ఆయన అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. యాత్రికులు మరణించడం పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.
Latest News