|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 01:45 PM
అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ సరికొత్త రికార్డు కనిష్టానికి పడిపోయింది. నిన్నటి ట్రేడింగ్‌లో రూపాయి విలువ తొలిసారిగా 90.42 స్థాయికి చేరింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడంతో వచ్చిన సానుకూలతను దేశీయ కార్పొరేట్లు, బ్యాంకుల నుంచి డాలర్లకు వెల్లువెత్తిన డిమాండ్ తోసిపుచ్చింది. దీంతో రూపాయిపై తీవ్ర ఒత్తిడి నెలకొంది.విదేశీ, ప్రైవేట్ బ్యాంకులు తమ మర్చంట్, కార్పొరేట్ చెల్లింపుల కోసం పెద్ద ఎత్తున డాలర్లను కొనుగోలు చేస్తున్నాయని ట్రేడర్లు చెబుతున్నారు. "ప్రపంచ పరిణామాలు సానుకూలంగా ఉన్నప్పటికీ, దేశం నుంచి డాలర్ల అవుట్‌ఫ్లో ఒత్తిడి ఎక్కువగా ఉంది" అని ఓ బ్యాంకర్ రాయిటర్స్‌తో తెలిపారు. ఈ కారణంగానే రూపాయి కోలుకోలేకపోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Latest News