|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 01:51 PM
అక్రమ వలసలను నియంత్రించేందుకు తాము తీసుకుంటున్న కఠిన చర్యలను ట్రంప్ ప్రభుత్వం గట్టిగా సమర్థించుకుంది. సరిహద్దుల్లో భద్రతా లోపాల వల్ల దేశానికి తీవ్ర ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని, చట్టబద్ధమైన, చట్టవిరుద్ధమైన వలసల మధ్య స్పష్టమైన తేడా ఉందని తేల్చిచెప్పింది.హౌస్ హోంల్యాండ్ సెక్యూరిటీ కమిటీ సమావేశంలో హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ మాట్లాడుతూ.. అక్రమ వలసలకు ముగింపు పలుకుతున్నామని, నేర చరిత్ర ఉన్నవారిని గుర్తించి, అరెస్టు చేసి, దేశం నుంచి బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వ చర్యల ఫలితంగా సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లు గత దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి పడిపోయాయని, గత ఏడాదితో పోలిస్తే దాదాపు 80% తగ్గాయని తెలిపారు.
Latest News