|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 10:46 PM
ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి ఆడుతున్నప్పటికీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ సాధించని జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటి. ఎంత మంది స్టార్లు వచ్చినా.. ఎన్నిసార్లు కెప్టెన్సీ మార్చినా.. ఆ జట్టు ఫేట్ మాత్రం మారడం లేదు. కప్పు కల నెరవేరడం లేదు. 2020లో తొలిసారి ఫైనల్ చేరినా.. ముంబై చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2026లో ఎలాగైనా టైటిల్ సాధించాలని డీసీ భావిస్తోంది. ఇందులో భాగంగా ఐపీఎల్ 2026 మినీ వేలానికి ఆ జట్టు సిద్ధమైంది. డిసెంబర్ 16న వేలం జరగనుంది.
ఐపీఎల్ 2026 మినీ వేలానికి ఢిల్లీ క్యాపిటల్స్ మంచి పర్స్‌తో వస్తోంది. ఆ జట్టు పర్స్‌లో రూ.21.8 కోట్లు ఉన్నాయి. ఈ వేలంలో ఆ జట్టు 8 మంది ఆటగాళ్లను తీసుకునే అవకాశం ఉంది. అందులో ఐదుగురు విదేశీ ప్లేయర్లు. ఐపీఎల్ 2026 వేలానికి ముందు.. ఢిల్లీ క్యాపిటల్స్ ఫాఫ్ డుప్లెసిస్, జాక్ ఫ్రెజర్ మెక్‌గర్క్, డోనావన్ ఫెర్రెరా(ట్రేడ్ ఔట్), సెదిఖుల్లా అటల్, మానవ్ కుమార్, మోహిత్ శర్మ, దర్షన్ నల్కండేను విడుదల చేసింది.
ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, అషుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మాదవ్ తివారి, త్రిపుర విజయ్, అజయ్ మండల్, కుల్దీప్ యాదవ్, మిచెల్ స్టార్క్, టీ నటరాజన్, ముఖేష్ కుమార్, దుష్మంత్ చమీరాను రిటైన్ చేసుకుంది. నితీశ్ రాణాను ట్రేడ్ చేసుకుంది.
ఢిల్లీ ఏయే స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది..?
ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రెజర్ మెక్ గుర్క్‌లను డీసీ విడుదల చేసింది. దీంతో ఆ జట్టుకు ఓపెనర్ అవసరం ఏర్పడింది. ఇందులో భాగంగా జానీ బెయిర్ స్టో, రెహ్మానుల్లా గుర్బాజ్ క్వింటన్ డికాక్, పృథ్వీ షా లాంటి ఆటగాళ్ల కోసం వెళ్లొచ్చు. తక్కువ ధరకు వస్తే.. మెక్ గుర్క్‌ను కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఫినిషర్ కోసం లియామ్ లివింగ్ స్టోన్, సర్ఫరాజ్ ఖాన్ కోసం ప్రయత్నించే అవకాశం ఉంది. ఇక డెత్ ఓవర్లలో 2 ఓవర్లు వేసే విదేశీ బౌలర్ కోసం కూడా డీసీ చూడనుంది. ఇందులో భాగంగా మతీశ పథిరాన, అన్రిచ్ నోర్జే, ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ల కోసం డీసీ ప్రయత్నించే అవకాశం ఉంది.
Latest News