|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 09:42 AM
కూటమి ప్రభుత్వ హయాంలో కుటీర పరిశ్రమలా మారిన నకిలీ మద్యం తయారీ దేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణమని వైయస్ఆర్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ములకలచెరువు కేంద్రంగా నకిలీ మద్యం తయారీ ప్రారంభించిన టీడీపీ నేతలు, ఇబ్రహీం పట్నం కేంద్రంగా రాష్ట్ర వ్యాప్త పంపిణీకి తెరలేపారని, ఈ మొత్తం వ్యవహారంలో పాత్రధారులు, సూత్రధారులూ టీడీపీ నేతలేనని తేల్చి చెప్పారు. తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో నకిలీ మద్యం తయారు చేసి, పాలవ్యాన్లలో మద్యం సరఫరా చేసినా.. ఎందుకు పోలీసులు పట్టుకోలేకపోయారని నిలదీశారు. ప్రజలే నకిలీ లిక్కర్ దందాను బయటపెట్టగా... పోలీసులు విధిలేక కేసు నమోదు చేశారని, ఈ కేసులో ప్రజలే విజిల్ బ్లోయర్లు అని మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. నకిలీ మద్యం తమ పార్టీ నేతలే అడ్డంగా బుక్కవడంతో.. డైవర్షన్ కోసం వైయస్ఆర్‌సీపీ నేతలను అక్రమంగా ఈ కేసులో ఇరికిస్తున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉంటే... మద్యం కుంభకోణంపై స్వతంత్ర ఆడిట్ చేయడంతో పాటు, జయచంద్రారెడ్డి సహా మద్యం కేసులో ప్రమేయమున్న టీడీపీ నేతలపై సమగ్ర విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Latest News