|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 09:43 AM
ఫైబర్‌నెట్ కేసు మూసివేత చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని వైయస్ఆర్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఇప్పటికే అసైన్డ్ భూములు, మద్యం స్కామ్ కేసుల క్లోజ్ చేయించుకున్న సీఎం చంద్రబాబు తాజాగా, ఫైబర్‌నెట్ కేసునూ అదే బాట పట్టించారని ఆయన ఆక్షేపించారు. ఇది తీవ్ర అధికార దుర్వినియోగమని, ఇంతకు మించిన దారుణ హేయం మరొకటి ఉండదని తేల్చి చెప్పారు. చంద్రబాబుపై నమోదైన ఫైబర్‌నెట్ స్కామ్ కేసు క్లోజ్ చేయొద్దంటూ తాను ఏసీబీ కోర్టులో వేసిన ప్రొటెస్ట్ పిటిషన్ తిరస్కరణ గురైందన్న గౌతమ్‌రెడ్డి, దానిపై హైకోర్టును ఆశ్రయించబోతున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో పని చేసే సీఐడీని తన అధీనంలోకి తీసుకున్న చంద్రబాబు, తనపై నమోదైన కేసుల్లో దర్యాప్తు ద్వారా సేకరించిన కీలక సాక్ష్యాధారాలన్నింటినీ మూలన పడేశారని గుర్తు చేశారు. అధికారులపై ఒత్తిడి తెస్తున్న చంద్రబాబు, ఆయనపై నమోదైన కేసుల్లో ఒక్కోటి క్లోజ్ చేయించుకుంటున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పి.గౌతమ్‌రెడ్డి ధ్వజమెత్తారు.
Latest News