|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 09:47 AM
విశాఖ విజన్ డాక్యుమెంటు రూపొందించిన ఘనత వైయస్.జగన్ దేనని.. అందులో భాగంగానే వైజాగే రాష్ట్రానికి ఎకనమిక్ గ్రోత్ ఇంజన్ అన్న విషయాన్ని ఆనాడే చెప్పారని వైయస్ఆర్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ స్పష్టం చేశారు. విశాఖపట్నం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... నాటి వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళికే... నేడు చంద్రబాబు నోట వినిపిస్తుందన్న ఆయన... మా విజన్ డాక్యమెంటులో భాగమే విశాఖలో ఇన్ఫోసిస్ ఏర్పాటైందన్నారు. తద్వారా ఇతర పరిశ్రమల రాకకూ మార్గం సుగమం అయిందన్న అమర్... ఎవరది విజన్? ఎవరు విజనరీ? ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉపాధి, పరిశ్రమల పేరుతో కూటమి భూదోపిడీ పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం... ఊరూ పేరు లేని సంస్థకు కారుచౌకగా భూములు అప్పగిస్తోందని మండిపడ్డారు. ఏం ఉద్యోగాలిస్తాయని రియల్ సంస్థలకు కారుచౌకగా భూకేటాయింపులు చేస్తున్నారని ప్రశ్నించారు. మరోవైపు 13.50 ఎకరాలు భూమి, స్టాంప్ డ్యూటీ మినహాయింపు, రూ.250 కోట్లు రాయితీలు కల్పిస్తూ... లులూ మాల్ కు చంద్రబాబు అడ్డగోలుగా కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ ప్రమోషన్ కోసం ప్రభుత్వ ధనంతో ప్రచారం చేస్తూ, ఆత్మస్తుతి పరనింద తప్ప... చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని తేల్చి చెప్పారు.
Latest News