|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 09:48 AM
చంద్రబాబు ప్రజా ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలని చూస్తే వైయస్ఆర్‌సీపీ చూస్తూ ఊరుకోదని మాజీ మంత్రి డా.సాకే శైలజానాథ్ హెచ్చరించారు. శింగనమల నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణలో భాగంగా సంతకాలు సేకరించిన పత్రాలను బుక్కరాయసముద్రం వైయస్ఆర్‌సీపీ పార్టీ కార్యాలయం నుంచి జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలసి భారీర్యాలీ నిర్వహించారు. ఎడ్లబండి, బైక్లతో ర్యాలీగా సాగుతూ జిల్లా వైసీపీ కార్యాలయానికి చేరుకుని పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డికి కోటి సంతకాల పత్రాలు అందజేశారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో నియోజకవర్గ వ్యాప్తంగా 1,04,034 సంతకాలు సేకరించినట్లు శైలజానాథ్ తెలిపారు. ఇప్పటికైనా ప్రైవేటీకరణ ఆలోచన మానుకుని ప్రజల హక్కులను కాపాడాలని చంద్రబాబును డిమాండ్ చేశారు.
Latest News