|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 10:27 AM
నెల్లూరు మేయర్ పదవి కోసం అధికార కూటమి, వైసీపీ మధ్య రాజకీయ పోరు ఉత్కంఠగా మారింది. ఈ నెల 18న మేయర్‌పై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనుంది. 2021లో వైసీపీకి 53 మంది కార్పొరేటర్లు ఉండగా, 2024 తర్వాత 40 మంది కూటమిలోకి వెళ్లారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చొరవతో ఐదుగురు తిరిగి వైసీపీలో చేరడంతో బలం 18కి చేరింది. ఇదే సమయంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తన వర్గానికి మేయర్ పదవి దక్కేలా ప్రయత్నిస్తున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య రాజకీయ వేడి పెరిగింది.
Latest News