|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 11:03 AM
పెట్టుబడిదారులకు శుభవార్త. బీఎస్ఈ–ఇండియా పోస్ట్ ఒప్పందంతో దేశవ్యాప్తంగా 1.64 లక్షలకు పైగా పోస్టాఫీసుల్లో మ్యూచువల్ ఫండ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ భాగస్వామ్యం ద్వారా గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల ప్రజలకు కూడా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి అవకాశాలు లభించనున్నాయి. బీఎస్ఈ స్టార్ MF ప్లాట్‌ఫామ్‌ను పోస్టాఫీసుల ద్వారా వినియోగించుకోవచ్చు. ఎంపిక చేసిన పోస్టల్ ఉద్యోగులు, ఏజెంట్లకు శిక్షణ ఇచ్చి పెట్టుబడిదారులకు మార్గదర్శకత్వం అందించనున్నారు. దీంతో ఆర్థిక అక్షరాస్యత మరింత పెరుగుతుంది.
Latest News