|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 11:30 AM
టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. తన పేరు, ఫొటోలను సోషల్ మీడియా, ఈ-కామర్స్ వేదికలపై అక్రమంగా వాడుకుంటున్నారని ఆరోపిస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. గవాస్కర్ అభ్యర్థనను అధికారిక ఫిర్యాదుగా పరిగణించి, ఆయన వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘిస్తున్న కంటెంట్‌ను వెంటనే తొలగించాలని సంబంధిత సంస్థలను ఆదేశించింది.ఈ పిటిషన్‌పై జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ విచారణ చేపట్టారు. ఆన్‌లైన్‌లో అభ్యంతరకర కంటెంట్‌పై చర్యలు కోరేవారు ముందుగా ఐటీ నిబంధనల ప్రకారం ఫిర్యాదుల యంత్రాంగాన్ని సంప్రదించాలని, ఆ తర్వాతే కోర్టును ఆశ్రయించాలని సూచించారు. గవాస్కర్ పిటిషన్‌ను ఫిర్యాదుగా స్వీకరించి, వారం రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని మధ్యవర్తులుగా ఉన్న ప్రతివాదులను కోర్టు ఆదేశించింది. ఉల్లంఘనలకు సంబంధించిన యూఆర్‌ఎల్‌లను 48 గంటల్లోగా సమర్పించాలని పిటిషనర్‌కు సూచిస్తూ, తదుపరి విచారణను డిసెంబర్ 22కి వాయిదా వేసింది.
Latest News