|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 11:31 AM
ఆలస్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులకు ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో భారీ ఊరట కల్పించింది. బాధితులకు చెల్లించాల్సిన నష్టపరిహారం మొత్తం రూ.500 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది.విమానం బయలుదేరడానికి 24 గంటల ముందు రద్దయిన సర్వీసుల ప్రయాణికులకు, కొన్ని విమానాశ్రయాల్లో తీవ్రంగా చిక్కుకుపోయిన వారికి ఈ పరిహారం అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. "నష్టపరిహారం అందించే ప్రక్రియను వీలైనంత పారదర్శకంగా, సులభంగా పూర్తి చేయడమే మా లక్ష్యం. మా ప్రస్తుత అంచనా ప్రకారం ఈ మొత్తం రూ.500 కోట్లు దాటుతుంది" అని ఇండిగో పేర్కొంది.ఈ నెల 3, 4, 5 తేదీల్లో తీవ్రంగా ప్రభావితమైన విమానాలను, విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులను గుర్తించే పనిలో ఉన్నామని, జనవరిలో వారందరినీ సంప్రదించి సజావుగా పరిహారం అందిస్తామని వివరించింది. ఇప్పటికే చాలా మందికి రిఫండ్‌లు పూర్తి చేశామని, మిగిలినవి కూడా త్వరలోనే వారి ఖాతాల్లో జమ అవుతాయని స్పష్టం చేసింది.
Latest News