|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 11:32 AM
సినీ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ఈరోజు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు విచ్చేసిన ఆయన, ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయక మండపానికి చేరుకున్న రజనీకాంత్ కుటుంబానికి వేద పండితులు వేదాశీర్వచనాలు అందించారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు. రజనీకాంత్ రాకతో ఆలయ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది.
Latest News