|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 11:33 AM
బులియన్ మార్కెట్‌లో వెండి ధర సరికొత్త చరిత్ర సృష్టించింది. మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో శుక్రవారం జరిగిన ఇంట్రాడే ట్రేడింగ్‌లో కిలో వెండి ధర తొలిసారిగా రూ.2 లక్షల మార్కును దాటింది. ట్రేడింగ్ సమయంలో ఒక దశలో కిలో వెండి రూ.2,01,388 ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకుంది.వివరాల్లోకి వెళితే, 2026 మార్చి 5న ముగియనున్న ఫ్యూచర్ కాంట్రాక్ట్ ధర ఒకేరోజులో రూ.2,400కు పైగా పెరిగింది. చివరకు రూ.1,520 లాభంతో రూ.2,00,462 వద్ద స్థిరపడింది. రిటైల్ మార్కెట్‌లోనూ వెండి ధర భారీగా పెరిగి కిలో రూ.1,95,180కి చేరింది. ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకారం, గురువారం కిలో వెండి ధర రూ.1,86,988గా ఉంది.
Latest News