|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 11:35 AM
పురుషుల లైంగిక సామర్థ్యాన్ని పెంచే 'వయాగ్రా' అందుబాటులోకి వచ్చి మూడు దశాబ్దాలు దాటింది. ఇన్నాళ్లకు మహిళల కోసం కూడా దానికి ప్రత్యామ్నాయంగా ఒక కొత్త ఉత్పత్తిని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అమెరికాకు చెందిన 'డేర్ బయోసైన్స్' అనే సంస్థ మహిళల్లో లైంగిక ప్రేరేపణను పెంచే ఒక ప్రత్యేకమైన క్రీమ్‌ను తయారు చేసింది. 'డేర్ టు ప్లే' పేరుతో వస్తున్న ఈ క్రీమ్ కేవలం 10 నిమిషాల్లోనే ప్రభావం చూపుతుందని సంస్థ చెబుతోంది.ఈ క్రీమ్‌లో వయాగ్రాలో ఉపయోగించే 'సిల్డెనాఫిల్' అనే రసాయనాన్నే వాడారు. దీన్ని ప్రైవేట్ భాగాల్లో రాసుకోవడం ద్వారా రక్త ప్రసరణ పెరిగి, స్పర్శ జ్ఞానం, లైంగిక వాంఛ మెరుగుపడతాయని తయారీదారులు చెబుతున్నారు. "మహిళల శరీరాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా రూపొందిస్తే సిల్డెనాఫిల్ అద్భుతంగా పనిచేస్తుందని శాస్త్రీయంగా నిరూపించాం. 1998లో వయాగ్రా పురుషుల లైంగిక వైద్యంలో విప్లవం సృష్టించింది. కానీ మహిళల విషయంలో దాదాపు 30 ఏళ్లుగా ఎలాంటి పురోగతి లేదు" అని డేర్ బయోసైన్స్ సీఈఓ సబ్రినా మార్టుక్కీ జాన్సన్ తెలిపారు.
Latest News