|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 08:52 PM
కర్ణాటక కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి మార్పు అంశం మరోసారి కలకలం రేపింది. తన మద్దతుదారుడైన ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ చేసిన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్రంగా స్పందించారు. ఇక్బాల్ హుస్సేన్ మాటలను ఎవరూ నమ్మవద్దని, అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శనివారం వ్యాఖ్యానించారు.అంతకుముందు, ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడుతూ, జనవరి 6న డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు. "6, 9 తేదీలు డీకేకు అదృష్ట సంఖ్యలు. ఆయనకు అవకాశం ఇవ్వాలన్న డిమాండ్‌పై అధిష్ఠానం సానుకూలంగా స్పందిస్తోంది. పార్టీ నిర్ణయానికి మేమంతా కట్టుబడి ఉంటాం" అని ఆయన పేర్కొన్నారు. ఇక్బాల్ వ్యాఖ్యలకు మరో ఎమ్మెల్యే శివగంగ బసవరాజ్ కూడా మద్దతు పలికారు.
Latest News