పుతిన్‌ చేతిలో ఘోర అవమానం..... మళ్లీ నవ్వుల పాలైన పాకిస్తాన్ ప్రధాని
 

by Suryaa Desk | Sat, Dec 13, 2025, 08:57 PM

టర్క్‌మెనిస్తాన్‌లో జరిగిన అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌కు ఘోర అవమానం జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలవడానికి ప్రయత్నించిన తీరు తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. శుక్రవారం రోజున టర్క్‌మెనిస్తాన్ శాశ్వత తటస్థత 30వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, వ్లాదిమిర్ పుతిన్‌తో దౌత్యపరమైన సమావేశం కోసం వెళ్లారు. అయితే ఈ సమావేశం ఆలస్యం కావడంతో.. షెహబాజ్ షరీఫ్, పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ పక్క గదిలో ఎదురుచూడాల్సి వచ్చింది. చివరికి ఓపిక నశించి పాక్ ప్రధాని.. పుతిన్ సమావేశమైన గదిలోకి ప్రవేశించడం తీవ్ర దుమారం రేపుతోంది.


టర్క్‌మెనిస్తాన్ శాశ్వత తటస్థత 30వ వార్షికోత్సవం సందర్భంగా ఈ అంతర్జాతీయ వేదికను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా షెహబాజ్ షరీఫ్, వ్లాదిమిర్ పుతిన్‌తో ద్వైపాక్షిక సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ షెడ్యూల్ ఉన్నప్పటికీ.. షెహబాజ్ షరీఫ్, ఇషాక్ దార్ వేరే గదిలో ఏకంగా 40 నిమిషాల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. చివరికి ఓపిక నశించిన షెహబాజ్ షరీఫ్.. కనీసం కొద్దిసేపైనా పుతిన్‌తో మాట్లాడాలని భావించారు. కానీ అప్పటికే పుతిన్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌లు నిర్వహిస్తున్న సమావేశంలోకి అకస్మాత్తుగా షెహబాజ్ షరీఫ్ ప్రవేశించారు.


దాదాపు 10 నిమిషాల తర్వాత షెహబాజ్ షరీఫ్.. అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. కెమెరాలో రికార్డ్ అయిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో నెటిజన్లు దౌత్యపరమైన పొరపాటుగా అభివర్ణిస్తూ.. పాక్ ప్రధానిపై తీవ్రంగా వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. బిచ్చగాళ్లపై తన టైమ్‌ను వేస్ట్ చేయాలని పుతిన్ అనుకోలేదని.. ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ఈ బిచ్చగాళ్లతో ట్రంప్ కూడా ఇలాగే వ్యవహరించారని ఇంకో నెటిజన్ రాసుకొచ్చారు. ఈ ఘటనను దౌత్యపరమైన తప్పిదంగా నెటిజన్లు పేర్కొంటున్నారు.


అయితే ఈ అంతర్జాతీయ వేదిక ఐక్యరాజ్యసమితిచే ఏకగ్రీవంగా ఆమోదించబడిన టర్క్‌మెనిస్తాన్ శాశ్వత తటస్థత 30వ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది. ఈ తటస్థత కారణంగా.. ఆ దేశం సైనిక కూటములకు దూరంగా ఉండటమే కాకుండా.. విదేశీ సైనిక స్థావరాలను తమ గడ్డపై అనుమతించడం లేదు.


Latest News
Three Noida schools receive hoax bomb threat emails; UP Police launch probe Fri, Dec 19, 2025, 02:41 PM
Maoist area committee member with Rs 5 lakh bounty killed in Bijapur encounter Fri, Dec 19, 2025, 02:37 PM
US Senators urge seizure of Russian 'shadow fleet' Fri, Dec 19, 2025, 02:20 PM
Seven killed in small plane crash at US North Carolina airport Fri, Dec 19, 2025, 02:14 PM
Suspect in killings at elite US institutions commited suicide Fri, Dec 19, 2025, 02:10 PM