|
|
by Suryaa Desk | Sun, Dec 14, 2025, 04:21 PM
నెల్లూరు నగరపాలక సంస్థలో గత కొంతకాలంగా కొనసాగుతున్న అవిశ్వాస వివాదానికి మేయర్ పొట్లూరి స్రవంతి రాజీనామాతో తెరపడింది. తనపై కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె నిన్న రాత్రి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కార్పొరేషన్ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఆదివారం తన రాజీనామా లేఖను కలెక్టర్ హిమాన్షు శుక్లాకు అందజేయనున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా స్రవంతి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తనను పదవి నుంచి దించేందుకు కొందరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన స్రవంతి.. కార్పొరేటర్లపై దాడులకు పాల్పడుతూ, మహిళా కార్పొరేటర్లను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు మేయర్ పదవి ఇచ్చింది సీఎం జగన్మోహన్‌రెడ్డి అని, ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొంది. తాను పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నానని, ప్రజాసేవలో కొనసాగుతానని వెల్లడించారు.
Latest News