|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 10:36 AM
శ్రీశైలం ప్రాజెక్ట్ పరిధిలోని దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం లోకకల్యాణార్థం స్వామి–అమ్మవార్ల పల్లకి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఆదివారం, పౌర్ణమి, మూల నక్షత్రం రోజుల్లో ఈ సేవ జరుగుతుంది. అర్చకులు ఉత్సవమూర్తులను పల్లకిలో ఆశీనులు చేయగా, నృత్య కళారూపాలు భక్తులను అలరించాయి. ఈ సందర్భంగా గుంటూరుకు చెందిన జి. నాగేశ్వరరావు దేవస్థాన అన్నదాన పథకానికి రూ. 1. 11 లక్షల విరాళం అందించారు.
Latest News