|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 11:41 AM
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న సీఎం చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకు.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో పేదలకు ఉచిత వైద్యం, వైద్య విద్య అందించాలన్న లక్ష్యంతో వైయస్.జగన్ ప్రారంభించిన మెడికల్ కాలేజీలకు ప్రైవేటీకరణ చేయడం ద్వారా పేదలకు వైద్య విద్యను దూరం చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. చంద్రబాబు నిర్ణయం వల్ల 2450 మెడికల్ సీట్లు పేదలు దూరమవుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవస్థలను చంద్రబాబు తన జేబు సంస్ధల్లా మార్చుకున్నారన్న ఆక్షేపించారు. మరోవైపు కేంద్ర స్థాయీ సంఘం పేరుతో పచ్చి అబద్ధాలు రాస్తున్న ఈనాడు... పీపీపీ విధానమే ముద్దు అంటూ బాబుకి కొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్.జగన్ ప్రారంచిన 17 మెడికల్ కాలేజీలను పూర్తి చేయడం ద్వారా.. ఆ ఘనత మీ ఖాతాలోనే వేసుకొవాలని చంద్రబాబుకు సూచించారు. అంతే తప్ప ప్రైవేటీకరణ పేరుతో పేదల నోట్లో మట్టికొట్టవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రైవేటీకరణ కూటమి విధానమైతే.. అందుకు వైయస్ఆర్‌సీపీ పూర్తి విరుద్ధమన్న సుధాకర్ బాబు దీనిపై రాజీనామా చేసి ప్రజల రెఫరెండంకు సిద్దమా అని ప్రశ్నించారు. వైయస్.జగన్ హాయాంలో కాలేజీల నిర్వహణ కోసం సెల్ఫ్ పైనాన్స్ సీట్లు ఏర్పాటు చేస్తే... మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నారని గగ్గోలు పెట్టిన చంద్రబాబు, అధికారంలోకి వస్తే 100 రోజుల్లో సెల్ఫ్ పైనాన్స్ రద్దు చేస్తామని బీరాలు పలికి. ఇవాళ పూర్తిగా కాలేజీలనే ప్రైవేటు పరం చేయడం పై ధ్వజమెత్తారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రాజకీయంగా కాక సామాజిక కోణంలో చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాదని పేద బిడ్డల చదువుల మీద ఉక్కుపాదం మోపాలని చూస్తే.. అప్పుడు కోటి కాస్తా పదికోట్ల సంతకాలవుతాయని తేల్చి చెప్పారు. పీపీపీకి వ్యతిరేకంగా ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమన్న సుధాకర్ బాబు, మా తలలు పగిలినా వైయస్.జగన్ నేతృత్వంలో పోరాటం ఖాయమని హెచ్చరించారు. 15వ తేదీన జిల్లాల నుంచి కోటి సంతకాలు వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయానికి రాగా... 18న జగన్ నాయకత్వంలో గవర్నర్ దగ్గరకు వెళ్తాయన్న ఆయన... ఈలోపు చంద్రబాబు తన మనసు మార్చుకోవాలని సూచించారు.
Latest News