|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 12:39 PM
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) విడుదల చేసిన తాజా నివేదికలో ఆంధ్రప్రదేశ్ పలు కీలక రంగాల్లో తనదైన ముద్ర వేసింది. ముఖ్యంగా పండ్లు, చేపల ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ఈ నివేదిక స్పష్టం చేసింది.వివరాల్లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1 కోటి 93 లక్షల టన్నుల పండ్లను ఉత్పత్తి చేస్తూ దేశంలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. అదేవిధంగా, 51.58 లక్షల టన్నుల చేపల ఉత్పత్తితో మత్స్య రంగంలోనూ ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా కొనసాగుతోంది.ఉత్పత్తి రంగాల్లోనే కాకుండా, ఆర్థికంగానూ రాష్ట్రం స్థిరమైన వృద్ధిని కనబరుస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) రూ.15.93 లక్షల కోట్లుగా, తలసరి జీఎస్‌డీపీ రూ.2.66 లక్షలుగా నమోదైంది.
Latest News