|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 12:54 PM
ఆంధ్రప్రదేశ్ ఇంధన సంరక్షణ, ఇంధన సామర్థ్యం రంగాల్లో మరోమారు జాతీయ స్థాయిలో తన సత్తా చాటింది. 2023 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక 'జాతీయ ఇంధన సంరక్షణ పురస్కారం'ను రాష్ట్రం సొంతం చేసుకుంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిన్న జరిగిన జాతీయ ఇంధన సంరక్షణ దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఏపీఎస్పీడీసీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) ఎల్. శివ శంకర్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.స్టేట్ డెసిగ్నేటెడ్ ఏజెన్సీ (ఎస్‌డీఏ) కేటగిరీలోని గ్రూప్-II రాష్ట్రాల విభాగంలో ఆంధ్రప్రదేశ్ మొదటి బహుమతిని గెలుచుకుంది. ఇంధన పొదుపు, వాతావరణ పరిరక్షణ పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఈ అవార్డు నిదర్శనంగా నిలుస్తోందని అధికారులు పేర్కొన్నారు. ఈ పురస్కారం రాష్ట్రానికి మరో గర్వకారణమైన మైలురాయిగా నిలిచింది.
Latest News