|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 02:06 PM
ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ నిర్వహించిన ఓట్ చోరీ ర్యాలీలో ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్ ఉభయ సభల్లో తీవ్ర దుమారం రేపాయి. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు ప్రధాని గౌరవాన్ని కించపరిచేలా హింసను ప్రేరేపించేలా ఉన్నాయని బీజేపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే దేశ ప్రజలకు, పార్లమెంట్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఓట్ చోరీ పేరుతో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు. సభ్యుల నినాదాలతో లోక్ సభ, రాజ్యసభల్లో గందరగోళం నెలకొంది.
Latest News