|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 06:49 PM
AP: కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో ఇటీవల షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రాత్రి వేళ ఇంట్లో నిద్రిస్తున్న పార్వతి అనే వృద్ధురాలిని ఆమె కోడలు తన ప్రియుడితో కలిసి హత్య చేసేందుకు యత్నించింది. పార్వతి అపస్మారక స్థితికి చేరుకోగా చనిపోయిందనుకుని భావించిన కోడలు ఆ వ్యక్తితో కలిసి తన మూడేళ్ల బిడ్డను తీసుకుని వెళ్లిపోయింది. తన భర్త పెట్రోల్ బంకులో నైట్ డ్యూటీకి వెళ్లిన తర్వాత ఆమె ఈ నేరం చేసింది. నిందితులిద్దరి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Latest News