|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 11:49 AM
అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రహదారుల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. దేవరకోట - కొడాలి రోడ్డు నిర్మాణానికి రూ. 5 కోట్లు మంజూరు అయ్యాయని, స్టేట్ హైవే ప్లాన్ నిధుల నుంచి ఈ మేరకు ప్రభుత్వం నిధులు కేటాయించిందని చెప్పారు. శనివారం దేవరకోటలో రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ రోడ్డు నాలుగు కిలోమీటర్ల మేర నిర్మించబడుతుంది.
Latest News