|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 02:38 PM
తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు అందించే గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలతో నిండిన గుడ్డు మెదడు చురుకుదనాన్ని, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పచ్చసొనతో సహా మొత్తం గుడ్డును ఉడికించి తినడం శ్రేయస్కరం. ఫైబర్ కోసం కూరగాయలతో కలిపి తీసుకోవాలి. కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు గుడ్ల సంఖ్యపై నియంత్రణ పాటించాలి. సరైన పద్ధతిలో గుడ్డును ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం.
Latest News