|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 02:43 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో కీలక సమావేశం నిర్వహించారు. నిన్న రాత్రి ఢిల్లీలోని తాజ్ హోటల్‌లో వీరిద్దరి భేటీ జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాజెక్టుల ప్రస్తుత పురోగతిని చంద్రబాబు అమిత్ షాకు వివరించారు. ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సుకు అద్భుతమైన స్పందన వచ్చిందని, లక్షల కోట్ల రూపాయల విలువైన అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదిరాయని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా కుదేలైందని, రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్రం ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Latest News