|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 03:06 PM
అనంతపురం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమానికి 3.80 లక్షల వ్యాక్సిన్ డోసులను సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. శనివారం నగరంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొని మాట్లాడుతూ, ఈ నెల 21 నుంచి 23 వరకు మూడు రోజులపాటు ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేస్తామని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడమే లక్ష్యంగా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వివరించారు.
Latest News