చిన్నారిపై దాడికి పాల్పడిన జిమ్ ట్రైనర్ అరెస్ట్
 

by Suryaa Desk | Sat, Dec 20, 2025, 03:19 PM

బెంగళూరులోని త్యాగరాజనగర్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డుపై ఆడుకుంటున్న ఓ చిన్నారిపై రంజన్ అనే జిమ్ ట్రైనర్ విచక్షణారహితంగా దాడి చేశాడు. బాలుడిని కాలితో బలంగా తన్నడంతో అతని శరీరం, చేతులపై గాయాలయ్యాయి. బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు బనశంకరి పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, ఆ తర్వాత స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు.ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. నిందితుడు రంజన్ గతంలోనూ ఆ ప్రాంతంలోని పలువురు చిన్నారులపై ఇలాగే దాడులకు పాల్పడినట్లు ఫుటేజీలో స్పష్టంగా క‌నిపించింది. ఉద్దేశపూర్వకంగానే పిల్లలను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నట్లు దృశ్యాల ద్వారా తెలుస్తోంది. పోలీసులు నిందితుడిపై సెక్షన్ బీఎన్ఏ 115/2 కింద కేసు నమోదు చేశారు.

Latest News
US forces seize 2nd oil tanker off coast of Venezuela Sun, Dec 21, 2025, 02:52 PM
Pakistan: Police vehicle targeted near Afghan refugee camp targeted in Khyber Pakhtunkhwa Sun, Dec 21, 2025, 02:44 PM
Would have got Jaiswal and Jitesh in place of Ishan and Washington, says Jaffer Sun, Dec 21, 2025, 02:36 PM
Sydney terror attack: Australia marks Day of Reflection for victims, orders intelligence review Sun, Dec 21, 2025, 01:43 PM
PM Modi interacts with Assam students aboard Brahmaputra cruise Sun, Dec 21, 2025, 01:37 PM