|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 03:24 PM
కేంద్ర హోం మంత్రిత్వశాఖ సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) కానిస్టేబుళ్ల నియామకాల కోటాను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో 10 శాతం ఉన్న అగ్నివీరుల కోటాను 50 శాతానికి పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. మొదటి దశలో మాజీ అగ్నివీరులకు కేటాయించిన 50 శాతం ఖాళీలకు, రెండో దశలో మిగిలిన ఖాళీలకు నియామకాలు చేపడతారు. 2022 జూన్‌లో కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ స్కీమ్‌ను తీసుకొచ్చింది.
Latest News