|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 03:24 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుందని లోకేష్ తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, వృద్ధులకు రూ.4 వేలు, వికలాంగులకు రూ.6 వేలు, తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేల పింఛను అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని గుర్తుచేశారు. తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికీ ఆర్థిక సాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్ల వంటి హామీలను అమలు చేస్తున్నామని వివరించారు. 150 రోజుల్లోనే డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేసి 16 వేల ఉపాధ్యాయ పోస్టులు, 6 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశామని చెప్పారు.
Latest News