బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులని ఖండించాలి
 

by Suryaa Desk | Sat, Dec 20, 2025, 03:27 PM

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల పట్ల దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ హింసను 'నరమేధం'గా అభివర్ణించిన ఆయన, ఈ దాడులను ఖండించని వారు అసలు భారతీయులేనా? అంటూ సంచలన ప్రశ్నలు సంధించారు.ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, మతం పేరుతో సాగుతున్న ఈ హింస మానవత్వానికే మాయని మచ్చ అని ఆవేదన వ్యక్తం చేశారు. "బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అమానుష దాడులను ఖండించకుండా మౌనంగా ఉన్న రాజకీయ పార్టీలకు, నాయకులకు ఈ దేశంలో కొనసాగే నైతిక హక్కు ఉందా?" అని నిలదీశారు. భారతదేశం సహనానికి, మత సామరస్యానికి ప్రతీక అని, అలాంటి దేశంలో ఉంటూ ఈ దాడులపై స్పందించకపోవడం దేశభక్తికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు.ఇది కేవలం ఒక దేశ సమస్య కాదని, అంతర్జాతీయ మానవ హక్కుల ఉల్లంఘన అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. బాధితుల పక్షాన నిలబడకుండా మౌనం పాటించడం అనైతికమని, ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగించడమేనని అన్నారు. ఈ దాడులను ఖండించలేని వారిని మనమే దేశం నుంచి బహిష్కరిద్దామని ఆయన పిలుపునిచ్చారు.

Latest News
US forces seize 2nd oil tanker off coast of Venezuela Sun, Dec 21, 2025, 02:52 PM
Pakistan: Police vehicle targeted near Afghan refugee camp targeted in Khyber Pakhtunkhwa Sun, Dec 21, 2025, 02:44 PM
Would have got Jaiswal and Jitesh in place of Ishan and Washington, says Jaffer Sun, Dec 21, 2025, 02:36 PM
Sydney terror attack: Australia marks Day of Reflection for victims, orders intelligence review Sun, Dec 21, 2025, 01:43 PM
PM Modi interacts with Assam students aboard Brahmaputra cruise Sun, Dec 21, 2025, 01:37 PM