|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 08:57 PM
టీ20 ప్రపంచకప్ భారత జట్టు నుంచి యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను ఎంపిక చేయకపోవడంపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇటీవలి కాలంలో ఫామ్ లేకపోవడం, టచ్ కోల్పోవడమే అతనికి ప్రతికూలంగా మారి ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు. గిల్ ఒక క్లాసిక్ బ్యాటర్ అని కానీ దక్షిణాఫ్రికాతో జరిగిన కొన్ని మ్యాచ్‌లలో ఇబ్బంది పడ్డాడని గుర్తుచేశాడు.ఈ విషయంపై గవాస్కర్ మాట్లాడుతూ గిల్‌ను తప్పించడం నన్ను ఆశ్చర్యపరిచింది. అతను నాణ్యమైన ఆటగాడు. ఫామ్ తాత్కాలికం, క్లాస్ శాశ్వతం. అయితే సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగడంతో అతను లయ అందుకోలేకపోయాడు. టీ20 ఫార్మాట్‌లో దూకుడుగా ఆడాలి. గిల్ సహజ శైలి టెస్ట్ క్రికెట్‌కు సరిగ్గా సరిపోతుంది. కానీ ఐపీఎల్‌లో తనేంటో నిరూపించుకున్నాడు. బహుశా ఫామ్ లేకపోవడమే అతడి ఎంపికపై ప్రభావం చూపింది అని విశ్లేషించాడు.
Latest News