|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 01:19 PM
వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి పుట్టిన రోజు(డిసెంబర్ 21) సందర్భంగా బెంగళూరులో ఘనమైన వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వైయస్ఆర్‌సీపీ ఐటీ వింగ్ – బెంగళూరు ఆధ్వర్యంలో IT WING SEASON–3 పేరుతో క్రికెట్ టోర్నమెంట్ శనివారం ఉదయం బెంగళూరు నగరంలోని చేతన్ క్రికెట్ గ్రౌండ్స్ వద్ద ఘనంగా ప్రారంభించారు. గత రెండు సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా భారీ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ క్రికెట్ టోర్నమెంట్‌కు పార్టీ శ్రేణులు, అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. వైయస్ఆర్‌సీపీ ప్రస్తుతం అధికారంలో లేకున్నా, జననేత వైయస్ జగన్‌పై ఉన్న అపారమైన అభిమానంతో వందలాది మంది ఐటీ వింగ్ సభ్యులు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో జరిపారు.
Latest News