|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 01:20 PM
వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వెయ్యేళ్ల పాటు వర్ధిల్లాలని పిల్లలు మొదలు పెద్దల దాకా నినదించారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు ఈ నెల 21ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో పలు అనాధాశ్రమాల్లో వైయస్ఆర్‌సీపీ నాయకుడు, మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏపీపీఎస్సీ సభ్యులు షేక్ సలామ్ బాబు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేలాదిమంది అనాధ చిన్నారులకు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైయస్‌ఆర్‌సీపీ ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు సునీల్ కుమార్ రెడ్డి, ఐటీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ భాస్కర్ రెడ్డి , వైయస్‌ఆర్‌సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్, ఐటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరంజన్ రెడ్డి, ఐటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి మణికంఠ రెడ్డి, ప్రజ్ఞానందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా షేక్ సలామ్ బాబు మాట్లాడుతూ, తమ అభిమాన నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజును అనాధాశ్రమాల్లో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ రాష్ట్ర ప్రజలకు అందించిన సేవలు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడతాయని కొనియాడారు. రాబోయే రోజుల్లో కూడా జగనన్న మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.వైయస్‌ఆర్‌సీపీ ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు సునీల్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, జగనన్న జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాల్లో భాగస్వాములమవడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. అనాధాశ్రమాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించి తమను భాగస్వామ్యం చేసినందుకు షేక్ సలామ్ బాబు గారికి కృతజ్ఞతలు తెలిపారు. జగనన్న జన్మదినాన్ని సేవా కార్యక్రమాల రూపంలో జరుపుకోవడం వైయస్‌ఆర్‌సీపీ సంస్కృతికి నిదర్శనమని పలువురు నాయకులు పేర్కొన్నారు.
Latest News