|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 01:22 PM
రాష్ట్రాన్ని సన్‌రైజ్ స్టేట్‌గా మారుస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌ను ‘క్రైమ్ రైజింగ్ స్టేట్’గా మార్చిందని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. కూటమి పాలన మొదలైనప్పటి నుంచి దాడులు, అత్యాచారాలు, హత్యలు, భూకబ్జాలు, ఆర్థిక నేరాలు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. మహిళల రక్షణను ఈ ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆమె వ్యాఖ్యానించారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తున్నా రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షిణించి పోయాయని వరుదు కళ్యాణి తీవ్ర విమర్శలు చేశారు.
Latest News