|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 01:23 PM
బాధ్యతాయుతమైన డిప్యూటీ సీఎం పదవిలో ఉండి చేతిలో గీతలు అరగదీస్తా, రోమాలు పీకుతాం, కాళ్లు కీళ్లు విరిచేసి కింద కూర్చోబెడతా, గతంలో అధికారంలో ఉన్నప్పుడే ఏం పీకలేకపోయారు.. అధికారంలోకి వస్తే ఏం పీకుతారు.. అంటూ పబ్లిక్ మీటింగ్‌లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఆయన మానసిక స్థితిని తెలియజేస్తున్నాయని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్ బాబు స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడాదిన్నర పాలనలో అన్నిరకాలుగా విఫలమైన కూటమి ప్రభుత్వం ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత తెచ్చుకుందని దాన్నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికే చంద్రబాబు డైరెక్షన్‌లో పీకుడు భాష వాడుతూ పవన్ కళ్యాణ్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని ఆరోపించారు. ఇలాంటి హేయమైన భాష మాట్లాడటం ద్వారా తన అసలు స్వరూపాన్ని పవన్ కళ్యాణ్ బయటపెట్టుకున్నాడని చెప్పారు.
Latest News