|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 02:02 PM
అండర్-19 ఆసియా కప్ టైటిల్ పోరుకు సర్వం సిద్ధమైంది. దుబాయ్ వేదికగా ఈరోజు జరగనున్న ఫైనల్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనున్నారు. టోర్నీలో అద్భుత ఫామ్‌లో ఉన్న యువ భారత్ మరోసారి పాక్‌పై గెలిచి, రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి కప్‌ను ముద్దాడాలని పట్టుదలగా ఉంది.ఆయుష్ మాత్రే సారథ్యంలోని భారత జట్టు ఈ టోర్నీలో అజేయంగా కొనసాగుతోంది. ముఖ్యంగా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. ఇప్పటికే రెండు మ్యాచ్‌లలో 400 పైచిలుకు స్కోర్లు నమోదు చేశారు. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ (171), అభిజ్ఞాన్ కుందు (209) భారీ శతకాలతో సూపర్ ఫామ్‌లో ఉన్నారు. మిడిల్ ఆర్డర్‌లో ఆరోన్ జార్జి, ఫినిషర్‌గా కాన్టిక్ చౌహాన్ రాణిస్తుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. బౌలింగ్‌లో పేసర్ దేవేశ్ దేవేంద్రన్ 11 వికెట్లతో జట్టుకు కీలకంగా మారాడు.
Latest News