|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 02:07 PM
టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ శుభ్ మన్ గిల్ కు టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటుదక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ విషయంలో గిల్ తో తాము టచ్ లో ఉన్నామని, టీ20 జట్టు కూర్పుపై ముందే ఫోన్ చేసి చెప్పామని బీసీసీఐ పేర్కొంది. అందిన సమాచారం ప్రకారం.. ఇటీవలి దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ లో చివరి రెండు మ్యాచ్ లకు గిల్ అందుబాటులో లేడు.పేలవమైన ప్రదర్శనకు తోడు గాయం కారణంగా గిల్ ను తుది జట్టు నుంచి తప్పించారు. ఈ క్రమంలో టీ20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ శనివారం జట్టును ప్రకటించింది. అదే సమయంలో అహ్మదాబాద్ నుంచి గిల్ చండీగఢ్ కు బయలుదేరాడు. జట్టులో కూర్పు, సమతూకం కోసం గిల్ ను పక్కన పెడుతున్నట్లు బీసీసీఐ వర్గాలు ఆయనకు ఫోన్ లో సమాచారం అందించారు.
Latest News