|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 02:08 PM
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. ‘‘వైఎస్ జగన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మంచి ఆరోగ్యంతో దీర్ఘాయువు పొందాలని కోరుకుంటున్నా” అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఆయురారోగ్యాలతో జగన్ సుదీర్ఘకాలం ప్రజాసేవలో కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.
Latest News