|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 02:10 PM
మహారాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సమరశంఖం పూరించింది. రాబోయే ఎన్నికల్లో పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని మహారాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జ్ రమేశ్ చెన్నితల స్పష్టం చేశారు. కేవలం పోటీ చేయడమే కాకుండా, అధికార పక్ష వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన ప్రకటించారు.ముంబై నగర అభివృద్ధి, పాలనపై సమీక్షా సమావేశం అనంతరం చెన్నితల మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబైలో జరిగిన అవినీతి, పాలనా వైఫల్యాలపై ఒక ప్రత్యేక 'చార్జ్‌షీట్' విడుదల చేయనున్నట్టు చెప్పారు. నగర అభివృద్ధి కోసం పార్టీ విజన్‌ను వివరిస్తూ త్వరలోనే మేనిఫెస్టోను ప్రజల ముందుకు తెస్తామని తెలిపారు.
Latest News