|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 02:15 PM
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకాన్ని విజయవంతం చేయడంలో ఆర్టీసీ ఉద్యోగులు అంకితభావంతో పనిచేస్తున్నప్పటికీ, కండక్టర్లు, డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, తీవ్రమైన పని ఒత్తిడిని ప్రభుత్వం గానీ, ఆర్టీసీ యాజమాన్యం గానీ పట్టించుకోవడం లేదని ఏపీపీటీడీ (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదర రావు ఆవేదన వ్యక్తం చేశారు.విధి నిర్వహణలో జరిగే చిన్నచిన్న పొరపాట్లకే ఆర్టీసీ తనిఖీ అధికారులు కండక్టర్లపై కేసులు నమోదు చేస్తున్నారని, డిపో మేనేజర్లు వాస్తవాలను పరిశీలించకుండానే వాటి ఆధారంగా సస్పెన్షన్లు, తీవ్ర శిక్షలు విధిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ పరిస్థితులు కొనసాగితే భవిష్యత్తులో కండక్టర్లు, డ్రైవర్లు విధులు నిర్వహించడం చాలా కష్టమవుతుందని పేర్కొన్నారు.ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో ఎన్‌టీఆర్ జిల్లా విద్యాధరపురం డిపో యూనియన్ నిర్మాణ మహాసభ నిర్వహించారు. ఈ సమావేశంలో పలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఏడు ఉమ్మడి జిల్లాల్లోని 15 డివిజన్లలో న్యాయపరమైన కారణాలతో నిలిచిపోయిన పదోన్నతుల సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. అర్హులైన ట్రాఫిక్, మెయింటెనెన్స్ ఉద్యోగులతో పాటు ఇతర అన్ని కేటగిరీల ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని కోరారు.
Latest News